• facebook
  • whatsapp
  • telegram

CTET: సీటెట్‌ దరఖాస్తులో సవరణలకు నవంబరు 3 వరకు అవకాశం

 

ఈనాడు, దిల్లీ: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌- సీటెట్‌) దరఖాస్తులో సవరణలు చేసుకోవడానికి సీబీఎస్‌ఈ నవంబర్‌ 3వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ‘‘ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు పరీక్ష కేంద్రాన్ని కానీ, ఇతర వివరాలను గానీ అక్టోబరు 28 నుంచి నవంబర్‌ 3 వరకు సవరించుకోవచ్చు. ఆ తర్వాత మార్పులకు అనుమతివ్వరు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, తత్సమానమైన పరీక్షను కనీసం 55% మార్కులతో పూర్తి చేయడంతో పాటు, మూడేళ్ల సమీకృత బీఈడీ-ఎంఈడీ చేసిన వారూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు గడువును అక్టోబరు 25 వరకు పొడిగించాం’’ అని సీబీఎస్‌ఈ పేర్కొంది.

Posted Date : 19-10-2021