• facebook
  • whatsapp
  • telegram

RRB ALP vacancy: సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఖాళీలు

* భారీగా పెరిగిన అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు గత జనవరిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో 5,696 ఖాళీలు పేర్కొనగా.. దీన్ని భారీగా పెంచుతున్నట్లు రైల్వే శాఖ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా మొత్తం 18,799 ఏఎల్‌పీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడయ్యాయి. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 ఖాళీలున్నాయి. అత్యధికంగా బిలాస్‌పూర్‌ జోన్‌లో 4,435; అత్యల్పంగా సిలిగురి జోన్‌లో 87 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి నోటీసుల కోసం వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని కోరింది. ఫస్ట్‌ స్టేజ్‌ సీబీటీ-1, సెకండ్‌ స్టేజ్‌ సీబీటీ-2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 


 

  ఏఎల్‌పీ రాత పరీక్ష స్టడీ మెటీరియల్‌ కోసం క్లిక్‌ చేయండి  



  ఆర్‌ఆర్‌బీ జోన్ల వారీగా అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టుల వివరాలు  
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.