* 2023-2024 ఎగ్జామ్ క్యాలెండర్‌లో స్వల్ప మార్పులు
ప్రతిభ డెస్క్: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు/ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఏటా పరీక్షలను నిర్వహిస్తూ ఉంటుంది. ఇందుకు సంబంధించి ఖాళీలను భర్తీ చేసేందుకు ఎప్పటికప్పుడు ఎస్‌ఎస్‌సీ చర్యలు తీసుకుంటోంది. గతంలో విడుదలైన 2023-2024 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేస్తూ తాజాగా పరీక్ష తేదీల వివరాలను వెల్లడించింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 19 ఉద్యోగ ప్రకటనల(మే నుంచి) విడుదల, దరఖాస్తు, పరీక్ష తేదీల షెడ్యూల్‌ను వెల్లడించింది. జూన్ 14న ఎంటీఎస్(నాన్ టెక్నికల్), జులై 20న ఎస్సై(దిల్లీ పోలీస్), జులై 26న జేఈ, ఆగస్టు 2న స్టెనో(గ్రేడ్ సి, డి), ఆగస్టు 22న జేహెచ్‌టీ, సెప్టెంబర్ 1న కానిస్టేబుల్(దిల్లీ), అక్టోబర్ 10న ఎంటీఎస్(సివీలియన్), సెప్టెంబర్ 1న స్టెనో(గ్రేడ్-సి), సెప్టెంబర్ 8న ఎస్‌ఎస్‌ఏ/ యూడీసీ, సెప్టెంబర్ 22న జేఎస్‌ఏ/ ఎల్‌డీసీ, సెప్టెంబర్ 29న సీఎస్‌ఏ ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి.
రివైజ్డ్ 2023-2024 ఎగ్జామ్ క్యాలెండర్ వివరాలు...