• facebook
  • whatsapp
  • telegram

TS Group-4: ఒక్క పోస్టుకు 116 మంది పోటీ

8,180 పోస్టులకు 9.51 లక్షల దరఖాస్తులు

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్ర‌వ‌రి 3న‌ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జులై 1న రాతపరీక్ష జరగనున్న ఈ పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈ సారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.  

2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు. ఈ సంవత్సరం 8,180 గ్రూప్‌-4 పోస్టులకు 9,51,321 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.

 

సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 దరఖాస్తులు

రాష్ట్రంలో 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ఫిబ్ర‌వ‌రి 3న‌ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఆగస్టు నెలలో రాతపరీక్ష జరగనుంది.

 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 2,930..

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 2930 దరఖాస్తులు వచ్చాయి. ఈ శాఖలోని 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా అనస్థీషియా విభాగంలో 155 పోస్టులు భర్తీ చేయనుండగా వీటికి 332 దరఖాస్తులు వచ్చాయి. గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, సీటీ సర్జరీలో పోస్టుల కంటే తక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. గ్యాస్ట్రోఎంట్రాలజీలో 14 పోస్టులకు 8, సీటీ సర్జరీలో 21 పోస్టులకు 10, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌లో 14 పోస్టులకు 7, ఎండోక్రైనాలజీలో 12 పోస్టులకు 5 దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.

 

టీఎస్‌పీఎస్సీ > గ్రూప్‌-4 > స్టడీమెటీరియల్ 

 

1.  కరెంట్ అఫైర్స్

2.  అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

3.  నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం

4.  పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ

5.  భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం

7 భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం

8  భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర

 

మరిన్ని Subjects కోసం క్లిక్‌ చేయండి.....

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్ట్‌గార్డు ఉద్యోగాల్లో చేర‌తారా?

‣ కోల్‌ఫీల్డ్స్ కొలువులు సిద్ధం!

‣ జీవితబీమాలో ఆఫీసర్‌ ఉద్యోగాలు

‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!

‣ నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త!

‣ అందరి అంచనాల ప్రకారం ఉండాలా?

‣ సొంత నోట్స్‌తో సక్సెస్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.