• facebook
  • whatsapp
  • telegram

UGC-NET: ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ 

* జూన్‌లో యూజీసీ-నెట్‌ పరీక్ష

దిల్లీ: పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష (నెట్‌)కు హాజరుకావచ్చని ప్రకటించింది. జూనియర్‌ రీసర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) ఉన్నా లేకపోయినా..తమ డిగ్రీతో సంబంధం లేని ఏ సబ్జెక్టులోనైనా పీహెచ్‌డీని అభ్యసించవచ్చని తెలిపింది. అయితే దీనికోసం తమ నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థులు కనీసం 75 శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించే యూజీసీ-నెట్‌ పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ఆదివారం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉండే అవకాశం ఉందన్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.