• facebook
  • whatsapp
  • telegram

ECET: ఈసెట్‌లో 45% సీట్లు భర్తీ

ఈనాడు, అమరావతి: ఏపీఈసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 45% సీట్లే భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్‌ కౌన్సెలింగ్‌ వివరాలను కన్వీనర్‌ నాగరాణి వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో మొత్తం 40,331 సీట్లు ఉండగా... 18,178 భర్తీ అయ్యాయి. ఇంజినీరింగ్‌లో 243 కళాశాలల్లో 38,332 సీట్లు ఉండగా.. 18,029 మంది ప్రవేశాలు పొందారు. ఫార్మసీలో 1,999 సీట్లు ఉండగా... 149 నిండాయి. క్రీడల కోటా 182, ఎన్‌సీసీ కేటగిరీ 361 సీట్లను రెండో విడత కౌన్సిలింగ్‌లో భర్తీ చేయనున్నారు. శాప్‌ నుంచి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున వీరికి సీట్లు కేటాయించలేదు.
 

Published Date : 18-09-2022 13:20:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం