• facebook
  • whatsapp
  • telegram

Medicine: వైద్య విద్యార్థుల డిజిటల్‌ మూల్యాంకనం సరైనదే: సుప్రీంకోర్టు

ఈనాడు, దిల్లీ: వైద్య విద్య పరీక్షల్లో డిజిటల్‌ మూల్యాంకనం సరైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. డిజిటల్‌ మూల్యాంకనంపై ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది. డిజిటల్‌ మూల్యాంకనానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2019 అక్టోబరు 31న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ విశ్వవిద్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సుందరేశ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో హైకోర్టు జోక్యం సరికాదని పేర్కొంది. డిజిటల్‌ మూల్యాంకనాన్ని సమర్థిస్తూ లిఖితపూర్వక తీర్పు వెలువరించింది.
 

Published Date : 06-11-2022 13:22:34

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం