హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలను సిట్ గుర్తించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), డీఏవో (జనరల్ స్టడీస్, మ్యాథ్స్), ఏఈ (జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు), ఏఈ (సివిల్, ఎలక్ట్రికల్), టౌన్ ప్లానింగ్, జులైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది.
రంగంలోకి ఈడీ
ఈ లావాదేవీల గుట్టు రట్టు చేసేందుకే ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోనుండటం గమనార్హం. అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్లు గాని, దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు గాని ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీపై కేసు నమోదు చేయబోతోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రణాళికను పాటిస్తూ.. సన్నద్ధతను సమీక్షిస్తూ!
‣ మెరుగైన పీజీకి మేలైన మార్గం!
‣ చివరి వరకు స్ఫూర్తిని కొనసాగించాలంటే?
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.