• facebook
  • whatsapp
  • telegram

Exam: 27న పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష  

* 25న మాక్‌ పాలిసెట్‌- 2024

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏప్రిల్‌ 25న మాక్‌ పాలిసెట్‌- 2024 నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి తెలిపారు. ఏప్రిల్‌ 18న దీనికి సంబంధించిన పోస్టర్‌ను కళాశాలలో ఆవిష్కరించారు. పాలిసెట్‌- 2024కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎవరైనా దీనికి హాజరు కావొచ్చన్నారు. ఏప్రిల్‌ 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. రాయాలనుకునే వారు 83329 11155, 93907 875754 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. పాలిసెట్‌- 2024 ప్రవేశపరీక్ష ఏప్రిల్‌ 27 న జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. పోస్టర్‌ ఆవిష్కరణలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చిన్నం సుబ్బారావు, వైస్‌ప్రిన్సిపల్‌ వజ్రాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.