• facebook
  • whatsapp
  • telegram

JEE Main-2: జేఈఈ మెయిన్‌-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు

* ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు జేఈఈ అడ్వాన్సుడ్‌ దరఖాస్తులు

ఈనాడు, అమరావతి: జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) ఏప్రిల్‌ 22న విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 25న మెయిన్స్‌ ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. అంతకంటేముందే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షకు దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకుని.. మెరిట్‌ జాబితాను ఎన్‌టీఏ విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మందికి.. జేఈఈ అడ్వాన్సుడ్‌ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్‌ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.