ఈనాడు, హైదరాబాద్: మే 1 నుంచి జూన్ 13 వరకు టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనున్నట్లు తెలంగాణ పరీక్షల విభాగం వెల్లడించింది. హైదరాబాద్, హనుమకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో జరిగే ఈ కోర్సుకు పదో తరగతి లేదా లోయర్గ్రేడ్ టెక్నికల్ కోర్సు ఉత్తీర్ణులైన 18 నుంచి 45 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అభ్యర్థులు www.bse.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు ఫారాలను డౌన్లోడ్ చేసుకొని వాటిని నింపి పైన పేర్కొన్న అయిదు జిల్లాల విద్యాశాఖాధికారులకు సమర్పించాలని సూచించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.