• facebook
  • whatsapp
  • telegram

Results: ఏపీ టెన్త్‌ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599 మార్కులు

* హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: 100, 99, 100, 100, 100, 100.. ఇవేంటని సందేహిస్తున్నారా? ఇవి పదో తరగతిలో ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద సాధించారు. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివారు. తల్లిదండ్రులు ఆకుల నాగ వరప్రసాద్‌, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే కావడంతో టీచర్ల బోధనతోపాటు వారి గైడెన్స్‌ కూడా ఎంతగానో పనికొచ్చిందని మనస్వీ తెలిపారు. ఐఐటీలో చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.