* డౌన్లోడ్ చేసుకోండిలా..
* మే 7 నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు
ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఈఏపీసెట్) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్ ఈఏపీసెట్ పరీక్షలు జరగనుండగా మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,41,548 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకున్నారు. మిగతా అందరూ ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేశారు.
తెలంగాణ ఈఏపీసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
DOWNLOAD TS EAPCET MODELPAPERS
DOWNLOAD AP EAPCET MODELPAPERS
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.