• facebook
  • whatsapp
  • telegram

Polycet counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ 23 నుంచి

* మే 27 నుంచి జూన్‌ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన 


ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను మే 23 నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 27 నుంచి జూన్‌ 3 వరకు చేపడతారు. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు 31 నుంచి జూన్‌ 5 వరకు అవకాశం కల్పించారు. 5 నే ఐచ్ఛికాలు మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అదే నెల 7న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది. విద్యార్థులు సీటు పొందిన కళాశాలల్లో వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌ విధానం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జూన్‌ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

 


   పాలీసెట్ మాక్ కౌన్సెలింగ్స్   
 


ఆంధ్రప్రదేశ్‌
 


తెలంగాణ

Updated Date : 22-05-2024 19:05:25

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం