* జులై 28 వరకు అవకాశం
దేశ వ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్కు ఉద్యోగాల భర్తీకి విడుదలైన ఐబీపీఎస్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువును జులై 28 వరకు పెంచుతూ ప్రకటన విడుదలైంది. జులై 21తో చివరి తేదీ ముగిసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ (సీఆర్పీ)-XIV కి హాజరు కావాలనుకుని, ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 105, తెలంగాణలో 104 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తుకు సరికొత్త చివరి తేదీ: 28-07-2024.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.