ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేశ్ సూచన
ఈనాడు, అమరావతి: అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచించారు. శాసనసభ లాబీల్లో గురువారం తనకు ఎదురైన రాముతో లోకేశ్ మాట్లాడారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు పలువురు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించారని, వారిలో కొందరి చేత రాష్ట్రంలో సంస్థల్ని ఏర్పాటు చేయించినా, యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ దిశగా కృషి ప్రారంభించానని రాము తెలిపారు.