• facebook
  • whatsapp
  • telegram

PG medical: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా సీట్ల తగ్గింపు


ఈనాడు, అమరావతి: నీట్‌ పీజీ ద్వారా ఇన్‌సర్వీస్‌ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడిసిన్‌ స్పెషాలిటీల్లో 15%, నాన్‌-క్లినికల్‌ కేటగిరీ విభాగాల్లో 30% సీట్లనే భర్తీ చేస్తామని ప్రభుత్వం  పేర్కొంది. ఈ ఉత్తర్వుల్ని 2024-25లో అమలుచేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి స్పెషాలిటీల వారీగా భర్తీ చేసే సీట్ల సంఖ్యను ప్రకటిస్తారు. క్లినికల్‌ విభాగంలో 15%, నాన్‌-క్లినికల్‌ విభాగంలో 30% మించకుండా సీట్ల కేటాయింపు ఉంటుంది. పీజీ పూర్తిచేసిన వారు పదేళ్లపాటు విధిగా ప్రభుత్వ సర్వీసులో పనిచేయాలి. ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం వ్యవహరించని వైద్యుల అర్హత సర్టిఫికెట్లను రద్దుచేసే అధికారం విశ్వవిద్యాలయానికి ఉంది. అంతేకాకుండా రూ.50 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
 

Published Date : 26-07-2024 12:57:08

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం