• facebook
  • whatsapp
  • telegram

Anganwadi: 92 వేల అంగన్‌వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి

* సక్షమ్‌ అంగన్‌వాడీలుగా మార్పు
 


దిల్లీ: చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్‌వాడీలను ఉన్నతీకరించి సక్షమ్‌ అంగన్‌వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పోషణ్‌ భీ, పఢాయీ భీ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి మాస్టర్‌ ట్రెయినర్లు 11,412 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. శిక్షణ పొందిన తర్వాత వీరు దేశంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు అందరికీ ఆయా అంశాల్లో తర్ఫీదునిస్తారని మంత్రి పేర్కొన్నారు.
 

Updated Date : 26-07-2024 13:43:29

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం