• facebook
  • whatsapp
  • telegram

ఐఐఎస్సీ ప్ర‌వేశ గ‌డువు పొడిగింపు

​​​​​​

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ) బెంగ‌ళూరు.. జాయింట్ అడ్మిష‌న్ టెస్ట్ ఫ‌ర్ మాస్ట‌ర్స్‌(జామ్)-2021 ప్ర‌వేశ గ‌డువును పొడిగింది. ఈ ప‌రీక్షలో క‌ట్ ఆఫ్ మార్కులు సాధించిన అభ్య‌ర్థులకు ఐఐఎస్సీతోపాటు దేశంలోని ఐఐటీల్లో ప్ర‌వేశాలు కల్పిస్తారు. అయితే ఈ గడువు మే 20తో ముగియ‌నుండ‌గా.. మే 27 వ‌ర‌కు పొడిగిస్తూ ఐఐఎస్సీ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అభ్య‌ర్థులు ఐఐటీలు అందించే ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ డ్యుయెల్ డిగ్రీ, ఇత‌ర పోస్ట్ బ్యాచిల‌ర్స్ డిగ్రీ ప్రోగ్రాములతోపాటు, ఐఐఎస్సీలోని ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో చేర‌వ‌చ్చు.


వెబ్‌సైట్‌: https://jam.iisc.ac.in/

Posted Date : 20-05-2021