• facebook
  • whatsapp
  • telegram

ఎండీఎస్‌ కౌన్సెలింగ్‌పై రేపు సమాధానమివ్వండి

* కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం 

దిల్లీ: నీట్‌-ఎండీఎస్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు నిర్వహిస్తారో ఆగస్టు 11లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆగస్టు 9న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరీక్షలు గత ఏడాది డిసెంబరు 16న జరగడం గమనార్హం. వైద్య సీట్లలో ఓబీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపినందున కౌన్సెలింగ్‌ ఎప్పుడు జరుపుతారని న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మార్గదర్శకాలు ఖరారు చేయడానికి కనీసం రెండు వారాల సమయం కావాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘ఇదేమిటిది? ఓబీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలిపిందని మేం గత వారమే చదివాం. మీరిప్పుడు కౌన్సెలింగ్‌ను అక్టోబరుకో, నవంబరుకో తీసుకెళ్లేటట్టు ఉన్నారు. దీన్ని ఆమోదించం. బుధవారమే దీనిపై సమాధానం చెప్పండి. ఆ రోజున తొలి కేసు కింద దీన్నే చేపడుతాం’’ అని స్పష్టం చేసింది. 

Posted Date : 09-08-2021