• facebook
  • whatsapp
  • telegram

NEST: నెస్ట్‌-2021 కీ విడుద‌ల‌

నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌)-2021 ఆన్స‌ర్ కీ విడుద‌లైంది. కీతోపాటు ఆన్స‌ర్ షీట్ల‌ను ప‌రీక్ష‌కు హాజ‌రైన అభ్య‌ర్థుల ఈ-మెయిల్స్‌కు పంపించిన‌ట్లు సంబంధిత అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కీలో ఏమైనా అభ్యంత‌రాలుంటే ఫిర్యాదు చేయ‌వ‌చ్చ‌ని తెలిపాయి. నెస్ట్ పరీక్ష‌ను ఆగ‌స్టు 14న నిర్వ‌హించారు. ఈ పరీక్ష ద్వారా నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐఎస్ఈఆర్) భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స‌లెన్స్‌ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్రవేశం పొందవచ్చు. 

వెబ్‌సైట్‌:  https://www.nestexam.in/

Posted Date : 21-08-2021