• facebook
  • whatsapp
  • telegram

B.Ed Course in IITs: త్వరలో ఐఐటీల్లో బీఈడీ కోర్సు

* కేంద్ర విద్యాశాఖ అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభం

* కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

 

 

భువనేశ్వర్‌: దేశంలో ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడతామన్నారు. ఇందుకోసం నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ITEP) త్వరలోనే ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
‘రాష్ట్రాలు, దేశంలో చాలా బీఈడీ కాలేజీలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. మనం ఆశించిన ఉపాధ్యాయులను తీర్చుదిద్దుకోలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ మంచి ఉపాధ్యాయులు లేకపోతే.. నాణ్యమైన విద్యను ఆశించలేం. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న తరం ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. అందుకే ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ను (ITEP) పైలట్‌ ప్రాజెక్టు కింద ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నాం’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు ఉత్తమ కేంద్రాలని అభిప్రాయపడిన ఆయన.. ఒకవేళ ఔత్సాహిక ఉపాధ్యాయులకు ఐఐటీలు శిక్షణ ఇచ్చినట్లయితే విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడంతోపాటు ఉపాధ్యాయుల స్థాయి కూడా పెరుగుతుందని అన్నారు. ఐఐటీ భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన నూతన కేంద్రీయ విద్యాలయం ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ధర్మేంద్ర ప్రధాన్‌.. భవిష్యత్తుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు దేశవ్యాప్తంగా ‘ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్‌’ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు.

 

దేశవ్యాప్తంగా మొత్తం 15వేల పీఎం శ్రీ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని.. కేవలం ఒడిశాలోనే 500 నుంచి 600 పాఠశాలలు ఏర్పాటు చేయనున్నామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. అయితే, అన్నీ కొత్త పాఠశాలలే కాకుండా ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రీయ పాఠశాలలను వీటి పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. ఇక నాలుగేళ్ల బీఈడీ కోర్సును అందించేందుకుగాను ఐఐటీ భువనేశ్వర్‌తోపాటు పలు ఐఐటీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచరం. కేంద్ర విద్యాశాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ కోర్సును ప్రారంభిస్తాయి. ఈ ఏడాది నుంచే ఐఐటీ భువనేశ్వర్‌ నాలుగేళ్ల బీఈడీని మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆయుధ సంపత్తికి సమరం సెగ

‣ ధరల దరువు... ఆదాయాలు కరవు

‣ పల్లె బ్యాంకుల్లో వేల కొలువులు

‣ డీజే కావాలని అనుకుంటున్నారా?

‣ మీరెంత ధీమాగా ఉన్నారు?

‣ పిలుస్తోంది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు!

‣ అన్ని పరీక్షల్లోనూ ఉండే ప్రశ్నలివి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.