• facebook
  • whatsapp
  • telegram

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖ‌ల్లో 9,79,327 పోస్టుల ఖాళీలు

పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి
 

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా.. వాటిలో దాదాపు పది లక్షలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 40,35,203 ఉద్యోగాలు మంజూరు కాగా.. వాటిలో 30,55,876 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. పదవీ విరమణ, ప్రమోషన్లు, రాజీనామా, మరణాలు వంటి కారణాలతో ఆయా మంత్రిత్వశాఖల్లో ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాల సృష్టి, వాటిని నియామకాలను పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. అయితే, ఇటువంటి ఖాళీలను సాధ్యమైనంత వేగంగా భర్తీ చేయాలని ఆయా శాఖలు/విభాగాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామన్నారు. మరోవైపు, వచ్చే ఏడాదిన్నరలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 10లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్‌ కోర్సులు

‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ఆకర్షణీయ కోర్సులు

‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!

‣ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?

‣ స్వయంగా నేర్చుకుందాం

‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.