• facebook
  • whatsapp
  • telegram

Guest Faculty: అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ బి.రాజేంద్రకుమార్‌ తెలిపారు. సంస్కృతం-1, టాక్సేషన్‌-1, స్టాటటిక్స్‌-1, బిజినెస్‌ అనాలసిస్‌-2, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌-5, డేటా సైన్స్‌-1 ఖాళీలున్నట్లు చెప్పారు. జనరల్‌ కేటగిరిలో సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. పీహెచ్‌డీ, ఎన్‌ఈటీ, ఎస్‌ఎల్‌ఈటీ, యూజీ అర్హులైన వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు ధ్రువపత్రాలతో జులై 28న సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో సంప్రదించాలని, 29న ఉదయం 10 గంటలకు జరిగే ముఖాముఖీలకు హాజరు కావాలని సూచించారు. నారాయణగూడలోని బాబు జగ్జీవన్‌రామ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డా.గీతాలక్ష్మీ పట్నాయక్‌ వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు జులై 28 సాయంత్రం 5 గంటలలోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఆంగ్లం-2 తెలుగు-1, సంస్కృతం-1, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌-2, గణితం-1, స్టాటిస్టిక్స్‌-1, అప్లయిడ్‌ న్యూట్రేషన్‌-1, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌- 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.