ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల సొసైటీలో తరగతుల సమయాన్ని కుదిస్తూ ఆగస్టు 1న గురుకుల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రాస్ ఆదేశాలు జారీచేశారు. ఉదయం 8 గంటలకు బదులుగా తరగతులు 9 నుంచి ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు ముగుస్తాయని తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. గురుకులాల పనిదినాల్లో ఉదయం 5 గంటలకు విద్యార్థులు నిద్రలేవాలని, 7.30 నుంచి 8.30 వరకు టిఫిన్ ముగించాలని సొసైటీ పేర్కొంది. ఉదయం 9 గంటలకు తరగతులు ప్రారంభమై, సాయంత్రం 4.30 గంటలకు ముగుస్తాయి. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు స్నాక్స్ తీసుకోవాలి. సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు భోజనం చేసి, రాత్రి 9.15 గంటలకు అందరూ నిద్రపోవాలి. సెలవురోజుల్లో ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు స్టడీ, ప్రాజెక్టులు పూర్తిచేసుకోవాలి.
********************************************************
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.