* బ్రాంచి, కళాశాల ఎంపికపై అవగాహన అవసరం
* ఇంజినీరింగ్ కౌన్సెలింగ్కు సన్నాహాలు
కానూరు, న్యూస్టుడే: ఈఏపీసెట్ ర్యాంకులు రావడంతో ఆన్లైన్ కౌన్సెలింగ్కు సమయం ఆసన్నమయ్యింది. ఏఐసీటీఈ ఆదేశాల మేరకు సెప్టెంబరు నెల నుంచి ఇంజినీరింగ్ కళాశాలలు ప్రారంభం కావాలి. ఇందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యార్థులు బ్రాంచిలను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ బ్రాంచి తీసుకోవాలి? ఏ కళాశాలను ఎంపిక చేసుకోవాలి? అన్నదానిపై వారిని పలు రకాల సందేహాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారో ‘న్యూస్టుడే’ కథనం.
ఈ జాగ్రత్తలు అవసరం
* విద్యార్థులు తమకు ఏ రంగంపై ఆసక్తి ఉందో దాన్నే ఎంచుకోవాలి. ఆసక్తి లేకున్నా క్రేజ్ బ్రాంచిలను ఎంపిక చేసుకున్నా, ఎవరో స్నేహితుడు తీసుకున్నాడని అది తీసుకుంటే ఇబ్బందులు తప్పవు.
* కళాశాలలో మౌలిక సదుపాయాలు చూడాలి. వాటికి నాక్, అటానమస్, ఎన్బీఏ, తదితర గుర్తింపులు, సరైన ఫ్యాకల్టీ ఉందో, లేదో పరిశీలించుకోవడం.
* కళాశాల ఉత్తీర్ణత, ప్రాంగణ ఎంపికల శాతం ఎలా ఉందో వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవడం.
* ప్రాంగణ ఎంపికలకు కావాల్సిన నైపుణ్య శిక్షణను తొలి సంవత్సరం నుంచి ఇచ్చే కళాశాలను గుర్తించాలి.
* ఇంటర్ తర్వాత ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చే కళాశాలలను ఎంపిక చేసుకుని ఇబ్బంది పడే కన్నా క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చే కళాశాలలను ఎంచుకోవడం.
* ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేయాలా? లేదా పరిశ్రమలు స్థాపించాలా? లేక ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమా? అన్న అవగాహన ఇప్పటి నుంచే ఏర్పరుచుకోవాలి.
* భావ వ్యక్తీకరణ, ఆంగ్ల నైపుణ్యం పెంచుకోవడం.
* ప్రాక్టికల్ నాలెడ్జి అందుకోవడం ఇంజినీరింగ్ విద్యలో కీలకం.
విశ్వవిద్యాలయాల్లోనూ సీట్లు
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు డీమ్డు విశ్వవిద్యాలయాల్లో సీట్లు కూడా ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా కేటాయించనున్నారు. వర్సిటీ సీట్లలో 30 శాతం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఇస్తున్నారు. తద్వారా విట్, ఎస్ఆర్ఎంతో పాటు ఇతర విశ్వవిద్యాలయాలల్లో కన్వీనర్ కోటాతో సీటు సాధించి తక్కువ ఫీజుతో కోర్సు పూర్తి చేయవచ్చు. ఈ విధంగా తొలిసారిగా అవకాశం ఇస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థుల ఫీజులను కూడా ప్రభుత్వం రూ.70 వేలుగా నిర్ణయం ఇచ్చింది.
రెండు జిల్లాల్లో పరిస్థితి
జిల్లా | కళాశాలలు | సీట్లు | విశ్వవిద్యాలయాలు | సీట్లు |
కృష్ణా | 31 | 18,435 | 1 | 180 |
గుంటూరు | 38 | 21,690 | 2 | 600 |
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం
‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.