• facebook
  • whatsapp
  • telegram

Singareni: సింగరేణిలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు

 

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి సంస్థలో పారదర్శకంగా రాతపరీక్షలు నిర్వహిస్తూ కేవలం ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు.. అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారి సమాచారాన్ని తమ విజిలెన్స్‌ శాఖ ఫోన్‌ నం.9491145075కు తెలపాలని సంస్థ సంచాలకుడు ఎన్‌.బలరామ్‌ సూచించారు. ఈ మేరకు ఆగస్టు 13న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల కోసం దాదాపు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చాయి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారినే ఉద్యోగాల్లో నియమిస్తాం. ఇంటర్వ్యూ ఉండదు. సిఫార్సులను పరిగణనలోకి తీసుకోం. సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసేవారిని ఎవరూ నమ్మవద్దు. దొడ్డిదారిన ఉద్యోగం పొందాలని ప్రయత్నించే అభ్యర్థులనూ పరీక్ష నుంచి డిబార్‌ చేస్తాం. భవిష్యత్తులోనూ పరీక్షలకు హాజరుకాకుండా చర్యలు తీసుకుంటాం’’ అని ఆ ప్రకటనలో సంస్థ సంచాలకుడు వివరించారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.