ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 351 స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 26వ తేదీ రాత్రి 11.59 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గైనకాలజీ విభాగంలో 60, ఎనస్థీషియా-60, పిడియాట్రిక్స్-51, జనరల్ మెడిసిన్- 75, జనరల్ సర్జరీ -57, రేడియాలజీ -27, పతాలజీ-9, ఈఎన్టీ-9, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో 3 పోస్టులు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ కమిషనర్ వినోద్‌కుమార్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ సోషల్ మీడియాలో సమయం వృథా అవుతోందా?
‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?
‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్ టాప్!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.