• facebook
  • whatsapp
  • telegram

Engineering Counselling: ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో 45% మార్కుల అడ్డంకి

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో ఇంటర్మీడియట్‌లో 45శాతం మార్కుల అర్హత విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్‌లో పాల్గొనాలంటే ఓసీ, బీసీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో 45శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40శాతం మార్కులు ఉండాలనే నిబంధన ఉంది. కరోనా కారణంగా 2021లో ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించి, కనీస ఉత్తీర్ణత మార్కులను కేటాయించారు. అదనపు మార్కులు కావాలనుకున్న వారు అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవాలని బోర్డు సూచించింది. కొందరు విద్యార్థులు మార్కుల మెరుగుకు పరీక్షలు రాయలేదు. దీంతో ఇలాంటి వారికి కనీస ఉత్తీర్ణ మార్కులే ఉన్నాయి. ఈ ఏడాది నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 55 శాతంపైగా మార్కులు వస్తేనే ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి అర్హత ఉంటుంది. కొందరు విద్యార్థులకు రెండో ఏడాదిలోనూ ఆ స్థాయిలో మార్కులు రాలేదు. దీంతో వారు ఇప్పుడు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌కు అర్హత కోల్పోతున్నారు. మొదటి ఏడాదిలో పరీక్షలు నిర్వహించకుండా ఉత్తీర్ణత మార్కులు ఇచ్చినందున ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో అర్హత మార్కులు తగ్గించాలని కోరుతున్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?

‣ ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

‣ అవుతారా...ఆహార సలహాదారులు?

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.