• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా భర్తీకి పాత విధానమే

‘ఈనాడు’ వార్తకు స్పందన
ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ సీట్ల భర్తీలో ఆర్థికంగా వెనకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు పాత విధానం ప్రకారమే రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబ‌రు 6న‌ విద్యాశాఖ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈసారి కొత్త విధానంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారని, దానివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరగనుందని మంగళవారం ‘ఈనాడు’లో ‘ఎంసెట్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నష్టం’ శీర్షికన ప్రచురితమైన వార్తకు విద్యాశాఖ స్పందించింది. పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది మొత్తం బీటెక్‌ సీట్లకు 10 శాతం సీట్లను అదనంగా పెంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేశారు. ఈసారి 10 శాతం అదనంగా కాకుండా ఉన్న సీట్లలోనే 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ఇవ్వాలని ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ అంతర్గతంగా నిర్ణయించింది. దానివల్ల రిజర్వుడ్‌ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని వార్త ప్రచురితం కావడంతో విద్యాశాఖ స్పందించింది. ఉన్న సీట్లకు 10 శాతం సీట్లను పెంచి రిజర్వేషన్‌ అమలు చేసేలా నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.