• facebook
  • whatsapp
  • telegram

Latest News: 09-09-2022 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1.TS Tenth Class: టెన్త్ ఫైన‌ల్ ప‌రీక్ష‌ల్లో ఈసారి 11 పేపర్లు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ  రాష్ట్రంలో ఈసారి పదో తరగతి వార్షిక పరీక్షలకు మొదటి నుంచి ఉన్నట్లుగా 11 పేపర్లే ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఇటీవల స్పష్టం చేశారు. అంటే ఒక్క హిందీకి తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టులకు రెండు పేపర్లు (పరీక్షలు) ఉంటాయి. ఈసారి సాధారణ పరిస్థితులే ఉన్నందున సిలబస్‌ కూడా తగ్గించలేదని తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. TSPSC Jobs: టీఎస్‌పీఎస్సీ నుంచి ఇక వేగంగా నోటిఫికేష‌న్‌లు  

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇక వరుసగా ప్రకటనలు వెలువరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ ప్రకటనకు.. రాతపరీక్షకు మధ్య కనీసం మూడునెలల సమయం ఉండేలా షెడ్యూలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలకు 2 నెలల్లో, ఆఫ్‌లైన్‌ పరీక్షలకు మూడు నెలల్లో ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. MBBS Seats: తెలంగాణలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు!

ఈనాడు- హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే పంపించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. AE Results: ఏఈ పోస్టుల రాత పరీక్ష ఫలితాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌, వడ్డేపల్లి, న్యూస్‌టుడే: టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు సీఎండీలు వేర్వేరుగా సెప్టెంబ‌రు 8న ప్రకటనలు విడుదల చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Govt Jobs:పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులు

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖలో కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్‌ ఎం.హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌ 253, సీనియర్‌ అసిస్టెంట్‌ 173, సూపరింటెండెంట్‌ 103 పోస్టులు ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.