న్యాక్ ‘ఏ’ గ్రేడ్లో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ, ఏ+ గ్రేడ్ దక్కించుకున్న వాటి సంఖ్య 13కి చేరింది. ఇప్పటికే 10 కళాశాలలు ఈ గ్రేడ్ సాధించగా.. కొద్ది రోజుల క్రితం బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల 3.5 పాయింట్లతో ‘ఏ+’ పొందింది. ఈ గ్రేడ్ పొందిన మొదటి ప్రభుత్వ కళాశాల ఇదే. కామారెడ్డి, సత్తుపల్లి కళాశాలలు సెప్టెంబరు 27న న్యాక్ ఏ గ్రేడ్ సాధించినట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అలాగే యూజీసీ స్వయంప్రతిపత్తి (అటానమస్) పొందిన కళాశాలలు గత ఏడాది వరకు 11 ఉండగా.. వాటి సంఖ్య 19కి చేరనున్నట్లు చెప్పారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.