ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు
ఈనాడు, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు గత ఏడాది హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన క్లస్టర్ కళాశాలల విధానాన్ని ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు 6 విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను 24 క్లస్టర్లుగా గుర్తిస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఆదేశాలు జారీ చేశారు. క్లస్టర్ విధానంలో చేరిన కళాశాలలు.. అధ్యాపకుల సేవలతో పాటు ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు వంటివాటిని పరస్పరం వినియోగించుకోవచ్చు. గత ఏడాది హైదరాబాద్ నగరంలోని 9 యూజీసీ అటానమస్ కళాశాలలను క్లస్టర్ విధానంలోకి తెచ్చారు. తాజాగా ఉత్తమ పనితీరును కనబరుస్తున్న 24 ప్రభుత్వ కళాశాలల్లో అమలు చేయనున్నారు. వాటి పరిధిలో మరికొన్ని ఇతర ప్రభుత్వ కళాశాలలు కూడా ఉంటాయి. అధ్యాపకులు, విద్యార్థుల పరిశోధనలు, ఆవిష్కరణల కోసం క్లస్టర్ కళాశాలల్లో పరిశోధనా కేంద్రాలను నెలకొల్పుతారు. ప్రాంగణ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్లస్టర్ కళాశాలల పరిధిలోని అన్నింటినీ ఒక యూనిట్‌గా భావించి ఆయా కార్యక్రమాలు అమలు చేస్తారు. ఈ విధానాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను నవీన్ మిత్తల్ ఆదేశించారు.
విశ్వవిద్యాలయాల వారీగా క్లస్టర్లు..
ఓయూ: బేగంపేట (మహిళలు), నయాపూల్, నాంపల్లి, విద్యానగర్, సంగారెడ్డి, సిద్దిపేట.
కాకతీయ: ఆదిలాబాద్, ఖమ్మం (ప్రభుత్వ అటానమస్, మహిళా కళాశాలలు), వరంగల్, హనుమకొండ, మంచిర్యాల.
మహాత్మాగాంధీ: నల్గొండ ప్రభుత్వ, మహిళా కళాశాలలు.
పాలమూరు: గద్వాల, మహబూబ్‌నగర్ (ప్రభుత్వ, మహిళా కళాశాలలు), జడ్చర్ల, వనపర్తి.
శాతవాహన: జగిత్యాల, కరీంనగర్ (మహిళలు), కరీంనగర్ ఎస్ఆర్ఆర్.
తెలంగాణ: నిజామాబాద్ అటానమస్, కామారెడ్డి ప్రభుత్వ కళాశాలలు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ ఫార్మా నిపుణులకు తరగని డిమాండ్!
‣ ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్మెంట్ పీజీ!
‣ మహిళలకు ప్రత్యేకం.. ఆఫీసర్ ఉద్యోగాలు
‣ బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు
‣ జేఈఈ స్కోరుతో బీటెక్ డిగ్రీ, ఆర్మీ కొలువు
‣ అన్ని విభాగాలకు సమ ప్రాధాన్యం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.