• facebook
  • whatsapp
  • telegram

Higher Education: ఉన్నత విద్యా సంస్థల అక్రిడిటేషన్‌ ప్రక్రియ బలోపేతానికి కమిటీ

* నియమించిన కేంద్ర విద్యా శాఖ

 

దిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల పనితీరును మెరుగుపరిచి నాణ్యమైన విద్యకు భరోసా కల్పించేందుకు చేపట్టే ‘అసెస్‌మెంట్, అక్రిడిటేషన్‌’ ప్రక్రియను బలోపేతం చేయటానికి కేంద్ర విద్యా శాఖ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఐఐటీ కాన్పుర్‌ పాలక మండలి ఛైర్‌పర్సన్‌ డా.కె.రాధాకృష్ణన్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. అస్సాంలోని మహాపురుష శ్రీమంత శంకరదేవ విశ్వవిద్యాలయ ఉపకులపతి మృదుల్‌ హజారికా, లఖ్‌నవూ ఐఐఎం ఫ్రొఫెసర్‌ భరత్‌ భాస్కర్, ఉన్నత విద్యాశాఖలో సంయుక్త కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా జాతీయ అక్రిడిటేషన్‌ మండలికి మార్గసూచీని రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఉన్నత విద్యా సంస్థల మదింపు, అధికారిక గుర్తింపు(అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌) జారీ ప్రక్రియలోని లోపాలను సరిదిద్ది ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సిఫార్సులను కమిటీ చేస్తుందని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.