• facebook
  • whatsapp
  • telegram

PhD Students: ఆ ఆచార్యులకు కొత్త పీహెచ్‌డీ విద్యార్థులొద్దు

పదవీ విరమణకు మూడేళ్ల సర్వీస్‌ ఉన్నవారికి వర్తింపు
ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పనిచేసే ఆచార్యులకు మూడేళ్లు మాత్రమే సర్వీస్‌ ఉంటే వారు కొత్తగా పీహెచ్‌డీ విద్యార్థులను తీసుకోవడానికి వీల్లేదు. పీహెచ్‌డీకి కనీస ప్రమాణాలు, నిబంధనలు-2022 పేరిట యూజీసీ తాజాగా గెజిట్‌ విడుదల చేసింది. అంటే వారు గైడ్‌లుగా వ్యవహరించడం కుదరదు. ఉదాహరణకు రాష్ట్ర వర్సిటీల్లో బోధన సిబ్బంది పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు. వారు 57 సంవత్సరాల వయసు వరకు పీహెచ్‌డీ విద్యార్థులకు గైడ్‌లుగా వ్యవహరించవచ్చు. మిగిలిన మూడేళ్లలో కొత్త విద్యార్థులను వారికి కేటాయించరాదని యూజీసీ ఆదేశించింది. అప్పటికే ఉన్న పాత విద్యార్థులకు మాత్రం గైడ్‌గా ఉండొచ్చు. అది కూడా 70 ఏళ్లకు దాటరాదు.
మరికొన్ని ముఖ్యాంశాలు
 ప్రతి వర్సిటీ/కళాశాల తమవద్ద ఉన్న పీహెచ్‌డీ సూపర్‌వైజర్లు/గైడ్‌ల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచాలి. సూపర్‌వైజరు పేరు, హోదా, విభాగం, ఆయన వద్ద ఉన్న పీహెచ్‌డీ విద్యార్థుల పేర్లు, పరిశోధన అంశం, ప్రవేశం పొందిన తేదీ వివరాలను ఉంచడమే కాకుండా ఏటా వాటిని అప్‌డేట్‌ చేయాలి.
‣ విద్యార్థులు సిద్ధాంత పత్రాన్ని(థీసిస్‌) సమర్పించిన తర్వాత ఆర్నెల్లలోపు దాని మూల్యాంకనం, వైవా పూర్తి చేయాలి.
‣ అర్హులైన మహిళా పీహెచ్‌డీ పరిశోధకులకు పీహెచ్‌డీ కాలవ్యవధిలో 240 రోజులు ప్రసూతి/శిశు సంరక్షణ సెలవు ఇస్తారు.
‣ ప్రతి సెమిస్టర్‌లో ఒక రోజు విద్యార్థులు రీసెర్చ్‌ అడ్వయిజరీ కమిటీ ఎదుట హాజరై పరిశోధన పురోభివృద్ధిపై ప్రజంటేషన్‌ ఇవ్వాలి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-11-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.