ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 8 నుంచి 12వ తరగతి చదువుతున్న అమ్మాయిలకు ఉచితంగా శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ నాప్కిన్ కిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కిట్ల కొనుగోలు, పంపిణీకి పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ రూ.69.52 కోట్లను కేటాయించింది. ఈ మేరకు వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ నవంబరు 17న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దాదాపు 11 లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలల కోసం 11 లక్షల కిట్లను, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 22 లక్షల కిట్లను మొత్తంగా 33 లక్షల కిట్లను కొనుగోలు చేయనున్నారు. ఈ కిట్లో 6 శానిటరీ నాప్కిన్స్ పాక్స్, ఒక నీళ్ల సీసా, ఒక బ్యాగ్ ఉంటుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.