సూర్యాపేటకు చెందిన విద్యార్థినికి రూ.51 లక్షల వార్షిక వేతనం
ఈనాడు, వరంగల్: వరంగల్ నిట్లో జరుగుతున్న ప్రాంగణ నియామకాల్లో అమ్మాయిలు అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీలు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. బీటెక్ మూడో సంవత్సరం ఈసీఈ చదువుతున్న సూర్యాపేటకు చెందిన లిఖిత.. తాజా ప్రాంగణ నియామకాల్లో రూ.51 లక్షల వార్షిక వేతనంతో హైదరాబాద్‌లోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో కొలువుకు ఎంపికయ్యారు. అదే విభాగానికి చెందిన మరో విద్యార్థిని రుచితారెడ్డి (హైదరాబాద్) రూ.29 లక్షల వార్షిక ప్యాకేజీతో హైదరాబాద్‌లోని కంపెనీలో కొలువు సాధించారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రజ్ఞ (ఆదిలాబాద్) రూ.20 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో కొలువుకు ఎంపికయ్యారు. మాంద్యం ప్రభావంతో పాత కంపెనీలు నియామకాలకు దూరమవడంతో కొత్త కంపెనీలను ఆహ్వానించామని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్.వి.రమణారావు తెలిపారు.
16 నుంచి నిట్లో టెక్నోజియాన్
నిట్ క్యాంపస్(వరంగల్), న్యూస్‌టుడే: వరంగల్ నిట్‌లో డిసెంబరు 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ‘టెక్నోజియాన్-2022’ పేరిట దక్షిణ భారత దేశంలోనే రెండో అతిపెద్ద సాంకేతిక వేడుకలు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ ఆచార్య రమణారావు తెలిపారు. డిసెంబరు 14న నిట్ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ వేడుకలు దోహదం చేస్తాయన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్మీడియట్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
‣ కచ్చితంగా నేర్చుకోండి లీన్ 6 సిగ్మా
‣ పోలీస్ ఉద్యోగాల మొయిన్స్‌లో మెరవాలంటే?
‣ కోడింగ్ రాకపోయినా ఐటీ ఉద్యోగం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.