* పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన
పదో తరగతి ప్రశ్నప్రతం బయటకు రావడంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సస్పెండ్ చేశారని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ కె.గోపాల్, ఇన్విజిలేటర్లు ఎస్.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్ వేటు వేశారని వెల్లడించారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు.
పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమయ్యాక ఇన్విజిలేటర్ బందెప్ప ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసీ 9.37 గంటలకు మరో ఉద్యోగి సమ్మెప్పకు వాట్సాప్‌లో పంపించారని తెలిపారు. ఇన్విజిలేటర్ బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని పేర్కొన్నారు. రేపటి పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామన్నారు. తదుపరి పరీక్షలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.