* అమిత్ షాకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
చెన్నై, న్యూస్‌టుడే: సీఆర్‌పీఎఫ్ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ‘‘సీఆర్‌పీఎఫ్‌లో 9,212 ఖాళీల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌కు సంబంధించి కంప్యూటరు ఆధారిత పరీక్షలను ఆంగ్లం, హిందీల్లో మాత్రమే నిర్వహించనున్నట్లు ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించింది. మొత్తం ఖాళీల్లో 579 పోస్టులను రాష్ట్రంలో భర్తీ చేయనున్నారు. అయినా ఆ పరీక్షలను రాయలేని పరిస్థితి తమిళనాడు యువతకు ఏర్పడింది. 100 మార్కుల్లో 25 మార్కులు హిందీకి కేటాయించడం ద్వారా హిందీ తెలిసినవారికి మాత్రమే ఈ పరీక్షలు అనుకూలంగా ఉన్నాయి. ఇది పౌరుల సమాన హక్కులను తిరస్కరించేలా ఉంది’’ అని లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, హిందీ భాష తెలియని యువత కూడా సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసేందుకు ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పట్టు పెంచితే పడే మార్కుల పాచిక!
‣ డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.