ప్రతిభ డెస్క్: ఏపీ పదో తరగతి ఫలితాల్లో 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం పాసయ్యారు. మన్యం జిల్లా ప్రథమ (87.4%), నంద్యాల(60.39%) చివరి స్థానాల్లో నిలిచాయి. 933 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు నమోదయ్యాయి. గురుకుల పాఠశాలల్లో 95.25% ఫలితాలు సాధించాయి. మొత్తంగా చూస్తే గతేడాది(67.2%) ఉత్తీర్ణతా శాతం 5 శాతం పెరిగినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.