* ఐఐటీ మద్రాస్ వినూత్న ప్రయోగం
చెన్నై (ప్యారిస్), న్యూస్‌టుడే: దేశంలోనే తొలిసారిగా వైద్యవిద్య, ఇంజినీరింగ్‌ను కలిపి ఒకే కోర్సుగా ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చింది. ఈ కోర్సును నాలుగేళ్ల బీఎస్ ప్రోగ్రాం కింద ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ విభాగాన్ని కాగ్నిజెంట్ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణన్, ఐఐటీఎం డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మే 11న ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత మేధావుల ఆధ్వర్యంలో ఈ కోర్సుకు సంబంధించిన కరిక్యులమ్ తయారైందని వారు ప్రకటించారు. ఈ కోర్సుకు వన్నె తేవడానికి ప్రముఖ ఆసుపత్రులు, దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు https://mst.iitm.ac.in/ వెబ్‌సైట్ చూడొచ్చని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రామర్ తెలిస్తే మార్కులు ఈజీ
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ
‣ షిప్పింగ్ కోర్సులతో మేటి అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.