• facebook
  • whatsapp
  • telegram

Exam: ‘ఏఈఈ సివిల్‌’ పరీక్షకు 63 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 1,180 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) సివిల్‌ పోస్టుల భర్తీకి మే 22న‌ నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 18 జిల్లాల్లోకల 83 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 63 శాతం హాజరు నమోదైంది. ఉదయం జరిగిన పేపర్‌-1 పరీక్షకు 13,946 (62.89 శాతం) మంది, మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 పరీక్షకు 13,947 (62.90శాతం) మంది హాజరయ్యారు. మల్కాజిగిరి జిల్లా నాచారం మల్లాపూర్‌లోని భవానీ గ్రేస్‌ టెక్నాలజీస్‌ కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి నుంచి సెల్‌ఫోను స్వాధీనపరచుకుని సీజ్‌ చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఆ అభ్యర్థిపై మాల్‌ప్రాక్టీసు కేసు నమోదుచేసి పోలీసులకు అప్పగించామన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.