• facebook
  • whatsapp
  • telegram

AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ కీ విడుదల

* అభ్యంతరాలకు గ‌డువు మే 26

అనంతపురం (జేఎన్‌టీయూ), న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ పరీక్షలు మే 23తో ముగిశాయి. ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేశామని, దీనిపై అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9 లోపు తెలపొచ్చని ఈఏపీసెట్‌ ఛైర్మన్‌ రంగజనార్ధన, కన్వీనర్‌ శోభాబిందు తెలిపారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల కీ 24వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రాథమిక కీ ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. మే 15న మొదలైన ఈఏపీసెట్‌ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్‌ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

    

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షల ‘కీ’ కోసం క్లిక్‌ చేయండి

    

మరింత సమాచారం... మీ కోసం!

‣ అత్యున్న‌త స‌ర్వీసుల్లో అమ్మాయిలే టాప్‌!

‣ అనులోమ విలోమాల్లో అంత్యమధ్యమాలు!

‣ విద్యా కార్యక్రమాల్లో ఆ రెండు జిల్లాలకు ప్రాధాన్యం

‣ విశాఖలో నీట్‌, జేఈఈ శిక్షణ కేంద్రం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.