* ఎంఎన్‌జేలో త్వరలో అందుబాటులోకి
* క్యాన్సర్ సేవలకు ప్రత్యేక నర్సులు
ఈనాడు, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్సల్లో సేవలు అందించేందుకు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక నర్సింగ్ విధానం అమల్లోకి రానుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేకంగా ఆంకాలజీ సేవలపై శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో లేరు. సిబ్బంది అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సేవలకు వినియోగించుకుంటున్నారు. తొలిసారి ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఈ సేవలు అందించే నర్సింగ్ సిబ్బందిని తయారుచేసేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణత సాధించి, సాధారణ నర్సింగ్ కోర్సు పూర్తి చేసినవారు ఈ కోర్సులో ప్రవేశానికి అర్హులు. బీఎస్సీ ఆంకాలజీ నర్సింగ్ పేరుతో ఇది అందుబాటులోకి రానుంది. రెండేళ్ల కోర్సులో శిక్షణ తీసుకుంటూ అదే ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ కూడా చేయనున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి 50 సీట్లతో ఈ కోర్సు ప్రారంభిస్తామని ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిత కేంద్రాల్లో 396 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
‣ జీవో 46 రద్దు కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
‣ స్థానికేతర కోటా ఒక్క జిల్లాకే పరిమితం
‣ ఫీజుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.