• facebook
  • whatsapp
  • telegram

Group-1: రోజుకి ఎంత సిలబస్ పూర్తి చేశామనేదే ముఖ్యం

*సాధారణ కుటుంబం నుంచి గ్రూప్ -1 ఉద్యోగిగా..
 


అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా శ్రమించాలని అనకాపల్లి జిల్లా రవాణా శాఖాధికారి గోపిశెట్టి మనోహర్సూచించారు. ఇటీవల గ్రూప్పరీక్షల్లో విజయం సాధించి తొలి పోస్టింగ్గా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించారు. ఉన్నత కొలువు సాధించే దిశగా సాగిన ఆయన ప్రయత్నం ఎలా సఫలమైందో ఆయన మాటల్లోనే..


‘‘మాది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. నాన్న నాగేశ్వరరావు వ్యాపారి. తల్లి మంజుల గృహిణి. ఒకటి నుంచి ఆరోతరగతి వరకు సాలూరులో, పదో తరగతి వరకు బొబ్బిలిలో చదివాను. ఇంటర్విశాఖపట్నంలో.. డిగ్రీ, పీజీ దిల్లీలో పూర్తి చేశాను. చిన్నప్పటి నుంచి సివిల్స్సాధించాలని అనుకునే వాడిని. అందుకే భూగోళ శాస్త్రం (జాగ్రఫీ) మాస్టర్స్చేశాను. తరవాత ఆంధ్రా విశ్వవిద్యాలయంలో జాగ్రఫీపై పీహెచ్డీ మొదలుపెట్టా. 2022 సెప్టెంబరులో గ్రూప్పరీక్ష రాసి విజయం సాధించా. కుటుంబసభ్యులు ప్రోత్సాహం అందించారు. ప్రణాళిక ప్రకారం చదువుతూ గ్రూప్రాశాను. నాతోపాటు ఈ పరీక్ష 1,25,000 మంది రాస్తే వారిలో 6,500 మంది మెయిన్స్రాశారు. 220 మంది ఇంటర్య్వూకు వెళ్లగా 110 మంది ఎంపికయ్యారు. ఓపెన్క్యాటగిరీలోనే ఆర్టీఓగా ఎంపికయ్యా. ఈ ఉద్యోగం రావడం ఆనందమే. ఆర్టీఓగా పనిచేస్తూనే సివిల్స్రాయడానికి సన్నద్ధమవుతాను. ప్రభుత్వ రంగంలో ఉన్నత అధికారిగా ఉంటే సమాజానికి మన వంతు సాయం చేయగలమన్న ఉద్దేశంతోనే పోటీ పరీక్షల్లో రాణించాలని అనుకున్నా.


* నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ప్రణాళికాబద్ధంగా సాధన అవసరం. చాలా మంది రోజుకు ఇన్ని గంటలు చదవాలి అంటారు. అన్ని గంటలు చదివేస్తారు. కానీ సబ్జెక్టు, సిలబస్ఎంత  పూర్తి చేశారన్న ప్రణాళిక చాలామందిలో ఉండదు. ఇది చాలా ముఖ్యం. ఒకరోజులో మనం ఎంత సబ్జెక్టు చదవాలి సిలబస్ఎంత పూర్తిచేయాలన్నది లక్ష్యం పెట్టుకుని దాన్ని ఆరోజు పూర్తిచేయాలి. పాత ప్రశ్నపత్రాలు పరిశీలించి ప్రశ్నలు ఎలా ఇస్తున్నారో గమనించి దీనికి తగ్గట్టు సన్నద్ధం కావాలి.


* సేవ చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలి. డబ్బులు సంపాదించాలన్న భావన ఉండకూడదు. ప్రజలకు సేవలందించే అవకాశం మనకు వచ్చిందన్న ఆలోచనతో విధులు నిర్వహిస్తే మంచి అధికారిగా ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. కార్యాలయానికి వచ్చే వారు ఆ రోజు పనిమానుకుని వస్తారు. సకాలంలో పని చేస్తే వారు సంతృప్తి చెందుతారు. అధికారులపై గౌరవం ఏర్పడుతుంది. రవాణా కార్యాలయానికి వచ్చే వారికి సకాలంలో పనులు పూర్తిచేసి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాను.’’

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!

‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.