• facebook
  • twitter
  • whatsapp
  • telegram

దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

909 పారామెడికల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌



న్యూదిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్, లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజ్, డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్, కళావతి సరన్‌ చిల్ట్రన్స్‌ హాస్పిటల్, రూరల్‌ హెల్త్‌ ట్రైనింగ్‌ సెంటర్లు సంయుక్తంగా 909 పారామెడికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 


మొత్తం 909 పోస్టుల్లో.. ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేటర్‌-2, కంప్యూటర్‌-1, రేడియోగ్రాఫర్‌-22, ఎక్స్‌రే అసిస్టెంట్‌-18, ఈసీజీ టెక్నీషియన్‌-11, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌-159, జూనియర్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్‌-51, ఫార్మసిస్‌-13, ఫిజియోథెరపిస్ట్‌-42, ఆపరేషన్‌ థియేటర్‌ అటెండెంట్‌-20, నర్సింగ్‌ అటెండెంట్‌-218, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌-274, ఇతర పోస్టులు-78 ఉన్నాయి. 


పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో.. పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ పాసై ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. 


సీబీటీలో..

కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌లో 60 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. 

ప్రశ్నపత్రం మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. 

నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1 మార్కును తగ్గిస్తారు. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాబులను గుర్తించాలి. 

ప్రశ్నల స్థాయి కనీస విద్యార్హత స్థాయి మీదే ఆధారపడి ఉంటుంది. పోస్టును బట్టి పదోతరగతి కనీసార్హత స్థాయి అయితే.. పరీక్ష సిలబస్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. 

పరీక్ష తేదీని వెబ్‌సైట్‌లో ప్రకటించి.. అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2023

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26.10.2023

అడ్మిట్‌కార్డ్‌ డౌన్‌లోడింగ్‌: నవంబరు మొదటివారం, 2023

పరీక్ష: నవంబరు నాలుగోవారం, 2023 ఫలితాల వెల్లడి: డిసెంబరు మొదటి వారం, 2023

డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌: డిసెంబరు రెండో వారం, 2023

వెబ్‌సైట్‌: http://www.vmmc-sjh.nic.in/


సన్నద్ధత ఎలా?

విద్యార్హత ఆధారంగా సిలబస్‌ ఉంటుంది. కాబట్టి సబ్జెక్టుల మీద గట్టి పట్టు సంపాదించాలి. 

ఆన్‌లైన్‌లోనే పరీక్ష రాయాలి. దీన్ని అలవాటు చేసుకోవడం కోసం వివిధ వెబ్‌సైట్లలో ఉచితంగా అందుబాటులో ఉండే ఆన్‌లైన్‌ పరీక్షలు రాసుకోవచ్చు. 

ప్రకటించిన వివరాల ప్రకారం.. నవంబరు నాలుగోవారంలో పరీక్ష ఉంటుంది. అంటే.. సుమారుగా నెలరోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి సన్నద్ధతను ఇప్పటినుంచే మొదలుపెట్టాలి. 

ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని కేటాయించాలనేది టైమ్‌ టేబుల్‌ వేసుకుని.. దాన్ని కచ్చితంగా అమలుచేయాలి. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

‣ మెరుగైన భావ ప్రకటనకు మార్గాలివిగో..

‣ జ్ఞాపకశక్తి పెంచుకునే మార్గాలివిగో..!

‣ సమన్వయం సాధిస్తేనే సక్సెస్‌!

‣ బోధనలో మేటి అవకాశాలకు మెట్టు.. నెట్‌

Posted Date : 10-10-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌