‣ ముగిసిన పీజీ మెడికల్ ప్రవేశాలు
ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ క్లినికల్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. ఇన్సర్వీస్ విభాగంలో 553 సీట్లకు మొదటి విడతలో 246, రెండో విడతలో 334 సీట్లకు 289, మూడో విడతలో 131 సీట్లకు 65 భర్తీ కాగా.. మిగిలిన సీట్లను నాన్ సర్వీస్ కేటగిరీ కౌన్సెలింగ్కు బదలాయించారు. అలాగే నాన్ సర్వీస్ విభాగంలో 1085 సీట్లకు మొదటి విడతలో 999, రెండో విడతలో 616 సీట్లకు 530, మాప్ అప్ రౌండులో 225 సీట్లకు 102, స్ట్రే వేకెన్సీ విభాగంలో 147 సీట్లకు 24 భర్తీ అయినట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. మిగిలిన 123 సీట్లు ప్రాధాన్యం లేని నాన్ క్లినికల్ విభాగాలవని తెలిపింది. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మొదటి కౌన్సెలింగ్లో అందుబాటులో ఉన్న 770 సీట్లకు 536, రెండో విడత కౌన్సెలింగ్లో అందుబాటులో ఉన్న 542 సీట్లకు 441, మాప్ అప్ రౌండులో 172 సీట్లకు 65, స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్లో 128 సీట్లకు 32 భర్తీ కాగా.. ఇంకా 96 సీట్లు ఈ విద్యా సంవత్సరానికి మిగిలిపోయాయి. ఇప్పటికే విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. నకిలీ అనుమతుల కారణంగా ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్షిప్పులు (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.