• facebook
  • whatsapp
  • telegram

Anganwadi Posts: అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల  ఆహ్వానం

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకురాళ్ల ఉద్యోగాల భర్తీకి నవంబరు 10వ తేదీలోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు న‌వంబ‌రు 2న‌ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ అర్బన్‌, విజయవాడ గ్రామీణ, మైలవరం, చిల్లకల్లు, నందిగామ, తిరువూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో రెండు కార్యకర్తలు, 61 సహాయకురాళ్ల ఉద్యోగాలను రోస్టరును అనుసరించి భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. 21 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండి, పదో తరగతి విద్యార్హత కలిగిన స్థానిక వివాహిత మహిళలు అర్హులని వివరించారు. అర్హత కలిగిన వారు సమీప సీడీపీవో కార్యాలయాల్లోనూ లేదా విజయవాడ సమీపంలోని కానూరులోని మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.