• facebook
  • whatsapp
  • telegram

BRAOU: దూరవిద్య పరీక్షల ఫీజు గడువు 18

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరంలోని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో 2017 సంవత్సరానికి ముందు చేరిన విద్యార్థులకు పరీక్షల ఫీజు నవంబరు 18వ తేదీలోపు చెల్లించాలని డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. నవంబరు 23వ తేదీ లోపు రూ.500ల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు వచ్చే నెలా 9 నుంచి 12వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు వచ్చే నెలా 16 నుంచి 21వ తేదీ వరకు, తృతీయ సంవత్సర పరీక్షలు వచ్చే నెలా 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు నేరుగా అధ్యయన కేంద్రంలోగానీ, విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.