ఈనాడు, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్(ఎన్ఐటీహెచ్ఎం) డైరెక్టర్‌గా డాక్టర్ ఎస్.చిన్నంరెడ్డి నియామకంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ఐటీహెచ్ఎం డైరెక్టర్ పోస్టుకు చిన్నంరెడ్డి అర్హులు కారంటూ కాంగ్రెస్‌కు చెందిన బక్కా జడ్సన్ కోవారెంటో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యం వల్ల చిన్నంరెడ్డి నియమితులయ్యారన్నారు. ఆర్థిక శాఖ సిఫారసులకు వ్యతిరేకంగా ఎక్కువ మొత్తంలో ఆయనకు వేతనాలు చెల్లించారన్నారు. కాగ్ నివేదిక కూడా చిన్నంరెడ్డి చర్యలను తప్పుబట్టిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్ఐటీహెచ్ఎంలతో పాటు వ్యక్తిగత హోదాలో డాక్టర్ ఎస్.చిన్నంరెడ్డిలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను డిసెంబరు 18వ తేదీకి వాయిదా వేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.